చిత్రావతి ముంపు బాధితులకు అండగా ఉంటాం : జనసేన నాయకులు జయరామిరెడ్డి
అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామం మరి మేకలపల్లిలో జనసేన నాయకులు లాయర్ జయరాం రెడ్డి గారు పర్యటించి గ్రామ ప్రజలను పరామర్శించారు. ముంపు బాధితుల కష్టనష్టాలను తెలుసుకొని మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, మీ స్థితిగతులను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా కలిపించారు. గాయపడిన బాధితుల్ని పరామర్శించి వారికి మనో ధైర్యాన్ని కల్పించి, దెబ్బ తగిలిన చిన్నారి బాలుడిని R.D.T హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. ఈ పర్యటనలో లాయర్ మురళీకృష్ణ, పసుపులేటి శ్రీనివాసులు, నార్పల కల్యాణ కృష్ణ, ఈశ్వరయ్య జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.