పాకాల ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం లో జర్నలిస్ట్ ల పైన రాష్ట్రం లో దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉందా అంటే లేనే లేదు అభివృద్ధి తప్ప అవినీతి ఉంది, అభివృద్ధి తప్ప అన్యాయం ఉంది. అభివృద్ధి తప్ప గొంతెత్తి ప్రశ్నించిన గొంతుల్ని నొక్కెయడం తెలుసు, అభివృద్ధి తప్ప తప్పుడు కేసులు బనాయించడం తెలుసు అన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఎక్కడ ఏమి జరిగిన బాహ్య ప్రపంచానికి తెలియచేసే వాడే జర్నలిస్ట్ అటువంటి జర్నలిస్ట్ పై దాడిని చంద్రగిరి నియోజకవర్గం తరపున తీవ్రంగా కండిస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలం అధ్యక్షులు గురునాథ్ తలారి, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుళ్ళ, కార్యదర్శి షాజహాన్, మస్తాన్, కార్యాలయ ఇంచార్జి మస్తాన్ ( డాన్ ) పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com