
శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సుంకరి పేట గ్రామంలో కొందరు వైసిపి కార్యకర్తలు గ్రామ కంఠంలో ఉన్న సుమారు నలభై సెంట్ల భూమిని కబ్జా చేసి, పోలుల్, కంచె వేసి, అంగనవాడి భవనం కట్టవలసిన స్థలాన్ని మరియు చుట్టూ ఉండే గ్రామకంఠం మొత్తాన్ని కబ్జా చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు శ్రీ కోరుకొండ మల్లేశ్వరరావు ఆధ్వరంలో ఊరి ప్రజలందరూ కలిసి భూ కబ్జా జరిగిన ప్రదేశంలో మీడియా సమక్షంలో పోరాటం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నాయకులు, అధికారులు వచ్చి మీడియా సమక్షంలో కబ్జా చేసిన భూమిలో అంగన్వాడి భవనం కడతామని, ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లు పట్టాలు ఆ ప్రదేశంలో ఇస్తామని ప్రెసిడెంట్ గారు, మరియు అధికారులు మాట ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కారం కావడం వల్ల ఆందోళన విరమించడం జరిగింది. గ్రామ సమస్య పరిష్కారం కావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినటువంటి జనసేన పార్టీ నాయకులుకి గ్రామ ప్రజలు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.