కువైట్ ( జనస్వరం ) : ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ సరుకులు ఇంటింటికి పంచేందుకు చిన్న వ్యానుల కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. రేషన్ సంచుల కోసం 750 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇక ఆ వాహానాల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యానులు నెలలో మూడు రోజులు పని చేస్తే మిగతా 27 రోజులు మూలాన పడి ఉంటాయి. ఇలాంటి వాటికోసం ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని నిర్వీర్యం చేయడం చూస్తుంటే ప్రభుత్వ అసమర్థత తెలుస్తోందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పౌరులు నెలలో ఒకరోజు రేషన్ సరుకులు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న డీలర్ షాపు కి వెళ్ళి సరుకులు తీసుకోలేని సోమరితనంగా లేరు. ప్రజా ధనాన్ని వైసీపీ కాంట్రాక్టర్లకే ముట్టజెప్పి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇన్ని వేల కోట్లను ఇలా వృధా చేసేకంటే పరిశ్రమల కోసం వెచ్చించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో పార్టీ రంగుల కోసం 1300 కోట్లు వెచ్చించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేసారు. ఇకనైనా ప్రజలు మేల్కొని వైసీపీ నాయకులు చేస్తున్న మోసాలను గుర్తించి స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చూపించాలని కోరారు.