వనపర్తి ( జనస్వరం ) : వనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం చేయడం జరిగింది. అనంతరం క్రియాశీలక సభ్యత్వ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ కార్యాలయ ప్రారంభించడానికి వనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాలోని క్రియాశీలక సభ్యులకి బీమా పత్రాలు వారి చేతుల మీదుగా అందజేశారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com