అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త రికార్డు నెలకొల్పారు. ఫొటోతో సహా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. ఎన్నికల్లో జోక్యం ఆరోపణల్లో ట్రంప్ ఈరోజు జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. అక్కడ ట్రంప్‌కు ఖైదీ నంబర్ P01135809ను కేటాయించిన పోలీసులు.. రికార్డుల కోసం ఆయన ఫొటో(మగ్‌షాట్)ను కూడా తీశారు. గత ఐదు నెలల్లో ట్రంప్ నాలుగు సార్లు అరెస్ట్ కాగా, పోలీసు కేసు కింద ఫొటో తీయడం ఇదే తొలిసారి.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com