బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా గురువారం ప్రకటించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com