
ఉప్పల్ ( జనస్వరం ) : తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధం అని ప్రకటించిన శుభ సందర్భంలో ఉప్పల్ నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ కలసి తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఇంచార్జి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ముఖ్య నాయకులు రామ్ తాళ్లూరిను మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.