
పలాసలో గత 70 సంవత్సరాలుగా జీడి పరిశ్రమ నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నైపుణ్యం కలిగిన కార్మికులు పొట్ట కొట్టడమే పరిశ్రమలో భారీ యంత్రాల ప్రవేశపెట్టి యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జీడి కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ పూర్తి సంఘీభావం తెలిపారు. జీడి కార్మికుల దీక్షకు దీక్షలో జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి వెంటనే కలుగజేసుకుని పరిశ్రమలలో యాంత్రీకరణ విధానాన్ని విరమించుకోవాలని, కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో హరిశ్ కుమార్ శ్రీకాంత్, కొన కృష్ణ రావు, ఉదయ్, గిరీష్ మరియు పూర్ణ చంద్ర రావు కార్మిక వామపక్ష నాయకులు పాల్గొన్నారు.