Search
Close this search box.
Search
Close this search box.

గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన జనసైనికులు

        వలేటివారిపాలెం, (జనస్వరం) : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఎండ్లూరి సింగయ్య అనారోగ్యం కారణంగా పోకూరు బస్టాండ్ సెంటర్లో చిన్నబంకు పెట్టుకుని చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముకొని జీవనం సాగిస్తుండేవాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో వైధ్యశాలకు వెళ్ళే లోపే మరణించడం జరిగింది. ఈ సంఘటనపై చలించిన డా,,మహిధర్ నాయుడు వెంటనే శింగయ్య కుటుంబానికి జనసైనికుల ద్వారా రూ10,000 ఆర్ధిక సాయాన్ని అందించారు. గతంలోనూ కరోనా సమయంలో వలేటివారిపాలెం మండలం మొత్తం పేద కుటుంబాలకు ఐదురకాల కూ‌రగాయలను పంపిణీ చేశారు. ఆయన ధాతృత్వాన్ని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండ్లూరి రమేష్, బాలు, పుల్లయ్య భూషణం, రాంబాబు, అబ్రహం తధితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way