Search
Close this search box.
Search
Close this search box.

కౌలు రైతుల కష్టాలు, ఆవేదన, బాధలు

కౌలు రైతులు

             రైతు… ఎండనక, వాననక, అప్పుచేసి, పుస్తెలమ్మి, రెక్కలు ముక్కలు చేసి ఆరుగాలం శ్రమించి, ప్రపంచానికి తిండి పెట్టే దేవుడు. కనీసం మనిషిలాగ కూడా గుర్తించడం లేదనుకోండి అది వేరే విషయం. అలాంటి రైతుల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశం లో రైతులు రెండు రకాలు. 1. రైతులు 2. కౌలు రైతులు. కాస్తో, కూస్తో సొంత పొలం ఉన్న వాళ్ళు రైతులు. ఏ పొలం లేకుండా జమీందారులు, భూస్వాముల దగ్గర పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వాళ్ళు కౌలు రైతులు. వీరు ఒక నిర్దిష్ట కాలానికి ఆ పొలాన్ని డబ్బులు ఇచ్చో, పంటలో వాట ఇచ్చో ఆ పొలాన్ని కౌలుకు తీసుకుంటారు. కౌలు రైతులకు శాశ్వతంగా పంట భూమి ఉండదు కాబట్టి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి లబ్ధి చేకూర్చే చాలా సహాయాలు రావు. వాటిల్లో ప్రభుత్వ నుండి వచ్చే రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు పంట నష్ట పరిహారం, పంట భీమా లాంటివి ఏవి రావు. ఎందుకంటే అవన్నీ శాశ్వత హక్కు ఉన్న వారికే వస్తాయి. కౌలు రైతులకు రావు. వీటికి పరిష్కారం కోసం 2019 సెప్టెంబర్ 23 న G.O 410 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం.. కౌలు రైతులకు CCRC (Crop Cultivator Right Card) కార్డు ఇస్తారు. ఈ చట్టం ప్రకారం CCRC కార్డ్ ఉన్న రైతులకు పైన పేర్కొన్న రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ లాంటివి అన్నీ అందుతాయి. కానీ ఈ కార్డ్ పొందాలంటే ఆ భూమి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం చెయ్యాలి. చాలామంది యజమానులు సంతకాలు చెయ్యడం లేదు. ఇప్పటి దాకా ప్రభుత్వం 9.4% శాతం CCRC కార్డులు మాత్రమే ఇచ్చింది.

               ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రికల్చర్ వెబ్సైట్ లో 2017-18 లెక్కల ప్రకారం దాదాపు 15.36 లక్షలమంది కౌలు రైతులు ఉన్నారు. రైతు స్వరాజ్య వేదిక లెక్కల ప్రకారం దాదాపు 24 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ప్రస్తుత AP ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న కౌలు రైతుల సంఖ్య 5.22 లక్షలు మాత్రమే. ఈ వివరాలు స్కోచ్ అవార్డ్ ల కోసం AP ప్రభుత్వం పంపిన అధికారిక లెక్కల్లో ఉంది. ఇప్పడు ఈ చట్టం ప్రకారం CCRC కార్డ్ ఉన్న రైతులకు మాత్రమే పైన పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం నుండి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి లబ్ధి చేకూర్చే చాలా సహాయాలు వస్తాయి. వాటిల్లో రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు పంట నష్ట పరిహారం, పంట భీమా లాంటివి వస్తాయి. మిగతా వారికి రావు. దీని వలన చాలామంది కౌలు రైతులు నష్టపోతున్నారు. సొంత పొలం ఉండి వ్యవసాయం చేసే రైతులకే నష్టాలు వస్తుంటే, కౌలుకు తీసుకుని మరీ వ్యవసాయం చేస్తున్న రైతులు మరింత నష్టపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చాలా ఎక్కువ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 2019లో 1918 మంది రైతులు, 2020 లో 889 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇది అధికారిక లెక్కలు మాత్రమే కానీ దాదాపు 4200 పై చిలుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. G.O 43 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతులకు, కౌలు రైతులకు 7 లక్షలు పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. 2019లో 1029, 2020లో 889 మొత్తం 1918 రైతులు రెండేళ్లలో ఆత్మహత్య చేసుకున్నారు. 1918X700000 =1342600000 అంత ఇవ్వాలి. ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? దేశం లోనే మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో 3 స్థానంలో ఉంది. అప్పుల్లో కూరుకుపోయి, ప్రభుత్వాల నుండి సహాయాలు, సబ్సిడీలు అందక చనిపోతున్న కౌలు రైతులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా జనసేనపార్టీ ఉంటోంది అనడంలో ఆశ్చర్యం లేదు. 

         జనసేనపార్టీ అధినాయకుడు మొదలు పెట్టిన గొప్ప కార్యక్రమమే ” జనసేన రైతు భరోసా యాత్ర “. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను, వారి పిల్లలను చూసి చలించిన పవన్ కళ్యాణ్ గారు వారి చదువులకు, పేద తల్లిదండ్రులకు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి తన కష్టార్జితాన్ని 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఓ ప్రభుత్వం చెయ్యాల్సి పని, నిజానికి బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అంత గొప్ప సాయం గురించి తప్పుగా మాట్లాడ్డం వైసీపీ నాయకులకే చెల్లింది. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఇంతవరకు సాయం చెయ్యలేదు. కనీసం గుర్తించని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రభుత్వ పనతీరుకి ఉదాహరణ 3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు కదా… .ఏమైంది అది? అది ఉపయోగించి కరోనా లాంటి సమయాల్లో మద్దతు ధర ఇచ్చి ఉంటే రైతులకు ఊరటగా ఉండేది. ఆత్మహత్యలు తగ్గి ఉండేవి. ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి? తన తండ్రి జన్మదినాన్ని రైతుల దినోత్సవంగా జరిపే జగన్ రెడ్డి గారు 12-13 లక్షల మంది కౌలు రైతులును ఎందుకు గుర్తించడం లేదు? 5.22 లక్షల మందికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ఇదేనా ఒక సీఎం ఇచ్చే భరోసా? నిజానికి ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం రైతుల ఆత్మహత్యలను ఆపడం. దాని తగ్గట్టు కృషి చేయడం కానీ వైసీపీ ప్రభుత్వం అవేమీ చెయ్యడం లేదు. నేరుగా లక్ష కోట్లు ప్రజలకు, రైతులకు వేశాం అని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి గారు ఎందుకు రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నారు?

              ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వైఖరి ఫలితమే క్రాప్ హాలిడే. మద్దతు ధర ఇవ్వకపోవడం, కాలువల నిర్వహణ లేకపోవడం, ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం, మొత్తానికి ప్రభుత్వ విఫలం అవ్వడం, నిర్లక్ష్యం వలన కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దేశానికి అన్నం పెట్టే మనం ఇవాళ క్రాప్ హాలిడే దాకా రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం. రైతుల పక్షపాతమని డబ్బులిచ్చి మరీ ప్రకటనలు, ప్రచారాలు చేసుకుంటున్న జగన్ రెడ్డి గారు ఏమి భరోసా ఇచ్చారు? అంతటా వైఫల్యమే స్పష్టంగా కనబడుతోంది. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు, సొంత డబ్బును సాయంగా చేస్తూ నాయకుడు ఎలా ఉండాలో ముందుండి చూపిస్తున్నారు. 

కౌలు రైతులు సమస్యల పరిష్కారం కోసం మన రాష్ట్రంలోనే నలుగురు విద్యావేత్తలు పరిశోధన చేసి 2012 లోనే కౌలు రైతులు సమస్యలకు పరిష్కారాలు IJERT( International Journal of Engineering Research and Industrial Applications) లో ప్రచురించారు. ఆ పరిశోధన తాలూకు వివరాలు ఈ లింక్ ద్వారా చదవండి. క్లిక్ చేయండి

#Written By

ట్విట్టర్ ఐడి : @BhagathChegu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way