అరకు ( జనస్వరం ) : అనంతగిరి మండలంలో గల గిరిజన రైతులు పండించిన కాఫీకి ప్రభుత్వం తక్షణం గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన నాయకులు సాయి బాబా, సన్యాసిరావు ఆధ్వర్యంలో మంగళవారం కాఫీ రైతు దగ్గర పెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడుతూ కాఫీ గిట్టుబాటు ధర మీద అడిగి తెలుసుకున్నారు. అయితే కాఫీ కొనుగోలు చేసే వ్యాపారస్తులు కారుచౌకగా నూట నలభై రూపాయలు కిలోకి కొనుగోలు చేస్తున్నట్టు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసిరావు మాట్లాడుతూ గిరిజనులు పండించిన కాఫీని ప్రభుత్వం తక్షణం గిట్టుబాటు ధర కల్పించాలని, మైదాన ప్రాంతం వ్యాపారస్తులు వచ్చి, కారుచౌకగా గిరిజనుల దగ్గర కొనుగోలు చేస్తూ, మరోపక్క గిరిజనులకు నిలువు దోపిడీ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కొండప్ప తదితరులు పాల్గొన్నారు.