గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమం గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి యుగంధర్ పొన్న మాట్లాడుతు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మూడవ విడతలో ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్ నాయకులను తయారు చేయడం, వీరిలోనుండి సర్పంచి, ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ అభ్యర్థులను తయారు చేయడం, అవసరమైతే ఎమ్మెలే అభ్యర్థులకు కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారిలో నుండి తీసుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్య భీమా సౌకర్యం 5 లక్షలు, అనారోగ్యం పాలైతే యాభై వేలు వైద్య ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. ఇది జనసైనికులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు. గౌరవ అధ్యక్షులు లోకనాధం నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గం లో 4500 మంది సైనికులకు భీమా సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. తప్పకుండా ఈ నియోజకవర్గం లో 4500 క్రియా సభ్యత్వాలు నమోదు చేస్తాని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల అధ్యక్షులు రాజారత్నం, రాజు, చిరంజీవి, సురేష్, పురుషోత్తం, భాను ప్రసాద్, సమన్వయ కర్తలు హరి, నరేష్ రెడ్డి, రాఘవ,వెంకటేష్, వాలంటీర్ లు విజయ్, సోము, నవీన్, భాస్కర్ రెడ్డి, సూర్య, దిలీప్ చిరంజీవి యువత అధ్యక్షులు పాల్గొన్నారు.