గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికేలా ఈ నెల 17 వ తేదీన చిలకలూరిపేట సభ జరగనుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. దేశ ప్రధాని మోదీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేనాని పవన్ కల్యాణ్ లు పాల్గొనే చారిత్రక సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలతోనే రాష్ట్రానికి స్వర్ణయుగం సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో జరిగిన పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ణించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎప్పుడైతే మూడు పార్టీల పొత్తు కుదిరిందో అప్పుడే వైవీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. సభ అనంతరం వైసీపీ నేతలు అస్త్ర సన్యాసం చేయనున్నారని జోస్యం చెప్పారు. మోదీ , చంద్రబాబు , పవన్ ల నాయకత్వంలోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాకారం కానుందన్నారు. వచ్చే ఆదివారం జరగనున్న సభకు టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీ శ్రేణులతో పాటూ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆళ్ళ హరి కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com