Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ జనసైనికుడిని పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన తణుకు జనసేన నాయకులు

తణుకు

    తణుకు, (జనస్వరం) : తణుకు పట్టణం 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకుల దాడిలో పిల్లాడి పూర్ణ రామారావు తీవ్రంగా గాయపడడంజరిగింది. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు అనుకుల రమేష్, పిల్లాడి పూర్ణ రామారావు  కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరపున భరోసా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అనుకుల రమేష్ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గం లో ఏ జనసైనికుడికి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా జనసేన శ్రేణులు అందరూ కలసి 47500రూపాయలు భాదిత జనసేన కార్యకర్త పిల్లాడి రామారావు వైద్య నిమిత్తం అనుకుల రమేష్ భాదిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కానూరి మాధవ రాయుడు, ముత్యాల శివ రామకృష్ణ, అడబాల మణికంఠ, ఆవాల సాయి, భూపతిరాజు విజయకుమార్ రాజు, తామరపల్లి సాయి, నెయ్యల శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way