తూర్పు గోదావరి ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, సుంకర శ్రీనివాస్, మల్లిరెడ్డి బుచ్చిరాజు మానవత్వం చాటుకున్న వైనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.వివరాల్లోకి వెళితే కాకినాడ నుండి పెద్దాపురం నియోజకవర్గం వెళ్తుండగా మార్గమధ్యలో సామర్లకోట ముత్యాలమ్మ తల్లి ఆలయం దగ్గరలో కాకినాడ నుండి సిరిపురం వెళ్లే వాహనం బైక్ రోడ్డు గుంతలో పడి ఉన్నారు. గాయాలపాలయ్యి సృహ లేదు. వారిని అటుగా వెళ్తున్న కృష్ణవేణి గారు చూసి వెంటనే కారు ఆపి తన కారులో దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడి నుండి వారిని అంబులెన్స్ రప్పించి వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి పంపించడం జరిగింది.