
సూళ్లూరుపేట, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు జనసేన పార్టీ గ్రామ పర్యటనలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవరి సత్రం మండలంలోనీ చవటకండ్రిగ, పూలతోట, ఎక్కొల్లు గ్రామాలలో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రోడ్లు, డ్రైనేజీ కాలవలు, నేరుగా వారి ఇంటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామంలోని సమస్యలను పరిష్కారం జరిగే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు దువ్వూరు సనత్ కుమార్, యోగేష్,, వెంకయ్య, సుబ్రహ్మణ్యం, ముని రాజా, తరుణ్ పాల్గొన్నారు.