
మడకశిర ( జనస్వరం ) : మడకశిర మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమిదాలగొంది గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులకు పలు సమస్యల పట్ల దిశానిర్దేశం చేయడం జరిగింది. పంచాయతిలో ఎలాంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. కార్యాచరణ మన ఎలా ముందుకు వెళ్లాలి ఈ సమావేశంలో మాట్లాడుతూ మండల అధ్యక్షులు శివాజీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి రఘు, సంయుక్త కార్యదర్శి హనుమంతు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.