రాజమండ్రి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ లు కలిసి తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కారణంగా రాజమండ్రిలో నారా బ్రాహ్మణి గారిని కలిసారు. జనసేన టిడిపి పార్టీ కలిసి చేయబోయే భవిష్యత్ కార్యాచరణకై జనసేన టిడిపి పార్టీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడానికి, నియోజకవర్గాల వారీగా టిడిపి వారు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. వైసీపీ పార్టీ గద్దె దించడానికి దిశా నిర్దేశాలు చేయడం జరుగుతుందని కందుల దుర్గేష్ మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com