నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి మండలం ఇసుక పాలెం2 పంచాయతీ కస్తూరి అనే నిండు గర్భిణికి నెల్లూరు జీ జి హెచ్ హాస్పిటల్ లో ఆక్సిజన్ లెవెల్స్ 70కి పడిపోయాయి. ఆమెకు వెంటిలేటర్ ఐసియు బెడ్ తప్పనిసరి పరిస్థితి కావడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ లో ఐసియు బెడ్ కాళీగా లేదని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో విచారించగా పేషెంట్ కి కరోనా నెగిటివ్ రిపోర్ట్ తీసుకువస్తేనే తీసుకుంటాము అని చెప్పారు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ నందు కోవిడ్ పరీక్ష చెయ్యగా నెగిటివ్ రావడంతో సంతోషించిన బంధువులు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్లారు. అక్కడ తిరిగి కరోన పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. భయపడ్డా బంధువులు వెంటనే తిరిగి జి జి హెచ్ కి తీసుకొచ్చి చూపించడం జరిగింది. అక్కడ వారిని అడిగితే కన్ఫామ్ గా చెప్పలేము అని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో స్పందించిన జనసేన పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షానవాజ్ మాట్లాడుతూ ఇకనైనా వైద్య వృత్తిలో ఉండే కొందరి నిర్లక్ష్య ధోరణి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఓపికతో బాధ్యతగా వ్యవహరించాలని హాస్పిటల్ లో ఐసియు బెడ్ రూమ్స్ శాతాన్ని పెంచాలని అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఉచితముగా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ నిండు గర్భిణిని జి జి హెచ్ హాస్పిటల్ నుంచి పొగతోట వరకు తీసుకుని వెళ్ళటానికి ఏడు వేల రూపాయలు ఒక్క అంబులెన్స్ బాడుగ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆస్పత్రి వర్గాలు మరియు ప్రభుత్వ అర్థం చేసుకొని పేద బడుగు బలహీన వర్గాల వారే గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తారు అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా జనసేన మైనార్టీ విభాగం నాయకులు షానవాజ్ డిమాండ్ చేయడం జరిగింది.
ఇవి కూడా చదవండి :
గాజువాకలో కరోనా యాక్షన్ సెంటర్ గురించి, ప్రజల సమస్యల గురించి అధికారులకు విన్నవించిన జనసేన నాయకులు
సిటీ స్కాన్ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారు : నెల్లూరు జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు
నెల్లూరులో 4వ రోజు కరోనా బాధితులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here