అరకు ( జనస్వరం ) : వేలి మండలం ఇరగాయి పంచాయితీ పరిధిలో మారుమూల గ్రామం మొర్రిగూడ రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని జనసేన నాయకులు మాదాసు శ్రీరాము అన్నారు. లోతేరు నుండి మొర్రిగూడ గ్రామంలో వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తోందన్నారు. లోతేరు మీదుగా వయా తాంగులబెడ్డ, చందూర్ పొద వరకు రోడ్డు వేస్తే ప్రజలకు అన్నివిధాల రాకపోకలకు వాహనాల మీద ఆయా గ్రామాలకు వెళ్లే వారికి బాగుంటుందని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ గత 20 ఏళ్ళ కిందట వేసిన మట్టిరోడ్డు హుదూద్ తుపాన్ కి మొత్తం కొట్టుకుపోయిందని లోతేరు నుండి 7 కిలో మీటర్ల రోడ్డు మనుషులు నడవడానికి కూడా రోడ్డు సరిగ్గా లేకుండా రాళ్లు తేలిపోయిందని అన్నారు. అడుగుకో గుంత గానికో గొయ్యి అన్నట్టు మొర్రిగూడ రోడ్డు అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. ఎన్నోసార్లు నాయకులకు అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు పట్టించు కోవడంలేదన్నారు. ప్రతి ఎన్నికలకు మాత్రమే ప్రజాప్రతినిధులు వస్తారు హామిలిస్తారన్నారు. రోడ్లు వేస్తామన్నారు రోడ్లు వేయడం మానేశారు. ప్రజల ఇబ్బందులు ప్రజా ప్రతినిధులకు తెలియదా అని ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో అల్లంగి రామకృష్ణ, బిమిడి మత్యరాజు, గ్రామస్తులు మహిళలు పెద్దఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు.