పుట్టపర్తి ( జనస్వరం ) : బలిజ, కాపుల రిజర్వేషన్ల కోసం కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపకులు హరిరామ జగయ్య గారు నిరాహార దీక్ష చేస్తుండగా నిన్నటి రోజు రాత్రి 10 గంటల సమయంలో పోలీసుల వారు 85 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి అనికూడ చూడకుండా అదుపులో తీసుకుని ఆయనను తీసుకెళ్లడం ఏమాత్రం సమంజసమైన చర్య కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అణిచివేయాలనుకోవడం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు, కేంద్ర ప్రభుత్వమే EWS కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని తెలియజేసిన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడానికి బలిజ కాపుల పైన చిత్తశుద్ధి లేదు. మీరు చేస్తున్న ఈ చర్యల కారణంగా రాష్ట్రంలోని కాపు బలిజలు అంతా ఉద్యమిస్తారు అది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. కావున ఆయనని వదిలి పెట్టాలని జనసేన పార్టీ నుంచి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, జనసేన నాయకులు బాలా వెంకట్రాముడు, గూడా మధు, పూల రెడ్డప్ప, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.