టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వెళ్తున్న టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ ను అడ్డుకున్న పోలీసులు. ప్రజాభిప్రాయ సేకరణ అని పేపర్లో వార్త చూసి ఈ ప్రాంతావాసిగా, జనసేన అభ్యర్థిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వెళ్తుండగా పోలీసువారు తమకు మూలపేట జుంక్షన్ లో ఆపివేశారని ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతుందో తెలియడం లేదని ప్రజలు లేని ప్రజాభిప్రాయ సేకరణ ఏంటని కణితి కిరణ్ తెలిపారు. జనసేనపార్టీ తరుపున మూలపేట, విష్ణుచక్రం గ్రామ ప్రజలకు తాము ఎల్లపుడు అండగా ఉంటామని తమ న్యాయమైన కోర్కెల డిమాండ్లకు జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంత వాసులను కలసి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని అవసరమైతే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఇప్పటి ముఖ్యమంత్రి నాటి పాదయాత్ర లో ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన మాట ప్రకారం జీఓ నెంబర్ 1108 ని రద్దు చేయాలని, అలాగే వడ్డీతండ్ర మత్యకారులపైన పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని తెలిపారు. అలాగే తితిలీ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు పెంచి ఇస్తానన్న పరిహారం చెల్లించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలిపారు.