కడప జిల్లా రాజంపేట మండలంలో హత్యరాల అర్చ్ దగ్గర పేదలకు ఇల్లు ఇస్తున్నాం అని కొండ పైన ఉచిత గృహాలను 2007 సం లో వైఎస్సార్ హయాంలో ఇచ్చారు. అవి రెండు మూడు సం. ల లోపే నాసి రకం కట్టడం, స్లాబ్ లో సిమెంట్ తక్కువ శాతం ఉండటం వల్ల నీరు కారుతూ గత పది సం.లు పైగా దయనీయమైన పరిస్థితి కనబడుతోంది. ఇళ్లలో నీరు కారుతూ ఎపుడు పడిపోతాయో తెలియక ఎక్కడకి వెళ్ళలేక, అక్కడ ఇచ్చిన ఆ ఇళ్లలో బతకలేక చిన్న పిల్లలను పెట్టుకొని పేద ప్రజల ప్రాణాలు బిక్కు బిక్కుమంటూ దయనీయ స్థితి లో బతుకు సాగిస్తున్నారు.. ఇపుడు ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నా అవి డీ ఫారం పట్టాలు లాగా ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ఇచ్చే ఇళ్ళ స్థలాలలో కూడా అవకతవకలు జరిగాయన్నారు. సమస్య ను జన సేన పార్టీ రాజంపేట తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వారికి తగిన విధంగా న్యాయం చేకూరేలా వారికి అండగా ఉంటామని రాజంపేట జనసేన నాయకులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ, కత్తి సుబ్బారాయుడు, తాళ్ళపాక శంకరయ్య, తాళ్ళపాక సుబ్బారాయుడు (సుబ్బన్న) తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com