Logo
Date of Publish : 11 January 2021, 4:01 pm
Editor : Sake Naresh

ఇళ్ళు అని అపుడు, ఇళ్ళ పట్టాలు అని ఇపుడు ప్రజలని మోసం చేస్తున్నారు : రాజంపేట జనసేన నాయకులు

                కడప జిల్లా రాజంపేట మండలంలో హత్యరాల అర్చ్ దగ్గర పేదలకు ఇల్లు ఇస్తున్నాం అని కొండ పైన ఉచిత గృహాలను 2007 సం లో వైఎస్సార్ హయాంలో ఇచ్చారు. అవి రెండు మూడు సం. ల లోపే నాసి రకం కట్టడం, స్లాబ్ లో సిమెంట్ తక్కువ శాతం ఉండటం వల్ల నీరు కారుతూ గత పది సం.లు పైగా దయనీయమైన పరిస్థితి కనబడుతోంది.  ఇళ్లలో నీరు కారుతూ ఎపుడు పడిపోతాయో తెలియక ఎక్కడకి వెళ్ళలేక, అక్కడ ఇచ్చిన ఆ ఇళ్లలో బతకలేక చిన్న పిల్లలను పెట్టుకొని పేద ప్రజల ప్రాణాలు బిక్కు బిక్కుమంటూ దయనీయ స్థితి లో బతుకు సాగిస్తున్నారు.. ఇపుడు ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నా అవి డీ ఫారం పట్టాలు లాగా ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ఇచ్చే ఇళ్ళ స్థలాలలో కూడా అవకతవకలు జరిగాయన్నారు. సమస్య ను జన సేన పార్టీ రాజంపేట తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వారికి తగిన విధంగా న్యాయం చేకూరేలా వారికి అండగా ఉంటామని రాజంపేట జనసేన నాయకులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ, కత్తి సుబ్బారాయుడు, తాళ్ళపాక శంకరయ్య, తాళ్ళపాక సుబ్బారాయుడు (సుబ్బన్న) తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com