
పెందుర్తి, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం, 94 వార్డ్, పురుషోత్తపురం గ్రామంలో బొబ్బిలి శంకర్ గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అని గ్రామ పెద్దలు జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వెంటనే స్పందించి జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి లక్కీ గోవింద్ గారు వీరమహిళ ఉరిటి లీలాదేవి గారు 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు బలగ వైకుంఠరావు, 94 వార్డ్ జనసైనికులు ఏర్ని రాజు, శేఖర్, కళ్యాణ్, సింహాచలం, సూరిబాబు, గోపాల్, చందు, నవీన్, తరుణ్, శ్రావణ్, చక్రి, కరెంట్. గోపాల్, డి. ఈశ్వర్ రావు, బంగరిరాజు, శ్రీను, కృష్ణ,ఈ. ఈశ్వర్ రావు జనసైనికులు వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.