
ప్రత్తిపాడు మండలం, శంఖవారం మండలం, రౌతులపూడి మండలం, పెద్దమలపురం గిరిజనులు ప్రధానమైన సమస్య వాల గ్రామాలను ITDI లో కలపాలని పోరాటం చేస్తున్నారు. వారి సమస్యలను 10 రోజులు కిందట పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లమని జనసేన నాయకుల వద్దకు రావడం జరిగింది. జనసేన నాయకులు మెడిశెట్టి సూర్యకిరణ్ గారు, (బాబీ)కరణం సుబ్రహ్మణ్యంగారు, తుమ్మల రామలింగేశ్వరావు గారు, గాబు సుభాష్ గారు, చిన్న బాబీ గారు శమంగి యేసు, రాజు, రెడ్డి స్వామి అక్కడకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసికెళ్తామని బాబీ గారు, హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని చెప్పారు. ఈ సమస్యను ఉధృతం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.