
పత్తికొండ, (జనస్వరం) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గము మద్దికేర మండలంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను జనసేన నాయకులు రాజశేఖర్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు పత్తికొండ, మద్దికేర మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని పొలంలోనే కుళ్ళిపోవడం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, కరువు సహాయక నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకునే అంతవరకూ జనసేన పార్టీ తరఫున పోరాడతామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉల్లి, పత్తి, మిరప పంటలకు ఎకరాకు 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ వారికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. పప్పు శనగ, వాము పంటలకు ఎకరాకు 40000 వేల రూపాయల చొప్పున నష్టం జరిగిందని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ తరుపున ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రావుల అంజి, అనిల్, వీరేష్, చిన్న, పెండేకల్ రవి, జయరాముడు, జీవన్ కుమార్, పులి శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.