Search
Close this search box.
Search
Close this search box.

” పాడెక్కిన టీడీపీపార్టీ “

టీడీపీపార్టీ

             ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు చూసుకుంటే టీడీపీ పార్టీ పాతాళానికి పోతున్నట్టు అనిపిస్తోంది. అందుకు ఆ పార్టీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. ఒకసారి గతాన్ని చూస్తే….

               తెలివైన వాడు అవకాశాల కోసం ఎదురుచూడడు, అవకాశాలను తనే సృష్టించుకుంటాడు. 1995 సం.లో ఆగష్టులో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే రాత్రికి రాత్రే ప్రభుత్వ అధినేత మారిపోయాడు. ఎన్‌టి‌ఆర్ లాంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తిని గద్దె దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. తరువాతి కాలంలో ఆ పరిణామాలు ‘ఆగష్టు సంక్షోభం’గా చరిత్రకెక్కింది. లక్ష్మీపార్వతిని బూచీగా చూపి ఎమ్మెల్యేలను కూడగట్టడం ఒక ఎత్తైతే సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా తన వైపుకు లాక్కోవడం చంద్రబాబు చాణక్య నీతికి తార్కాణం. ఇలాంటి ప్రయత్నమే 84లో నాదెండ్ల భాస్కర్రావు కూడా చేసారు కానీ ప్రజలు అంగీకరించ లేదు. తిరిగి ‘అన్నగారు’ సీఎం కుర్చీ మీద కూర్చునేంత వరకు పోరాటం చేశారు. అప్పట్లో నాదెండ్లకు వ్యతిరేకంగా గవర్నర్ కు, రాష్ట్రపతికి అందిన టెలిగ్రాములు ఒక రికార్డు. కానీ ఈ సారి అలాంటిదేమి జరగలేదు. కారణం లక్ష్మీపార్వతిని అన్నగారు ద్వితీయ వివాహం చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబం కూడా అన్నగారిని దూరం పెట్టారు. కానీ మన అన్నగారు సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపుకు కారణం లక్ష్మీపార్వతి అని నమ్మారు. ఎవరి మాటలూ లెక్క చేయలేదు. ఐతే పార్టీలో రాను రాను లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువవుతోందని గ్రహించిన బాబు మెల్లగా అందరి మెదళ్లలో ఆమె పట్ల విద్వేషాన్ని ఇంజెక్ట్ చేసాడు.. అదృష్టవశాత్తు బాబు పన్నాగం ఫలించింది. ముఖ్యమంత్రి అయ్యాడు. థాంక్స్ టు వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్.
                 ప్రత్యర్ధులు ఆ అధికార మార్పిడి పరిణామాలను ‘వెన్నుపోటు’ అంటారు. నిజానికి ఆనాడు చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకోకుంటే టీడిపి అనే రాజకీయ పార్టీ అప్పుడే కాలగర్భంలో కలిసిపోయేది. ముఖ్యమంత్రి అయ్యాక బాబు ముందుగా చేసిన పనేంటంటే సొంత వాళ్ళను దూరం పెట్టడం. పోర్టుఫోలియో పంపకాలలో తేడాలు రావడంతో ఎన్.హరికృష్ణ, డి. వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆ గూటిలోంచి ఎగిరిపోయారు, బాలయ్య సినిమాల్లో బిజీ. ఇంక పార్టీలో బాబు ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ వెంటనే వచ్చిన 1999 సార్వత్రిక ఎన్నికల్లో బాబు & కో. బంపర్ మెజారిటీతో గెలవడం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయలేదు కారణం అభివృద్ధి, ‘దీపం’ వంటి పథకాలు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చేసిన ఘనత చంద్రబాబుదే. ఇండియా టుడే వారి ‘ఐ టి ఇండియన్ ఆఫ్ ది మిలీనియం’ పురస్కారంతో పాటు రాష్ట్రానికి  పెట్టుబడులను ఆకర్షించినందుకు గానూ ఎకనామిక్ టైమ్స్ వారి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా అందుకున్నారు. తనను తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి CEOగా అభివర్ణించుకునే వాడు బాబు. చంద్రబాబు పతనం కూడా మొదలైంది ఇక్కడ నుంచే. మెల్లగా తనలో దాగున్న నియంతృత్వ నైజాన్ని బయటపెట్టాడు. విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పై కాల్పులు జరిపించాడు. ‘బషీర్ బాగ్’ కాల్పులుగా చరిత్రకెక్కిన ఘట్టం అది.

                  పవర్ మీన్స్ పాలిటిక్స్, పాలిటిక్స్ మీన్స్ బిజినెస్. తనను తాను చాలా నీతిమంతుడుగా చెప్పుకుంటాడు చంద్రబాబు. తెర ముందు తెర వెనుక ఆయన కనుసన్నల్లో జరిగిన అవినీతి గురించి ఆయనకు తప్ప అందరికీ తెలుసు. తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అవినీతి, కుంభకోణంలో ఆయన పాత్ర లేదు అంటే నమ్మలేం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే బాబు మీద సుప్రీం న్యాయస్థానంలో ఎవరైనా కేస్ వేస్తే ‘స్టే’ అడగడానికి ఒక లాయర్ రెడీగా ఉంటాడు అక్కడ. 2011 / 2012 సం. సమయంలో వై ఎస్ విజయమ్మ సుప్రీంలో బాబు మీద 11 ఆరోపణలతో కేస్ వేస్తే ‘నాట్ బిఫోర్ మీ’ (ప్లీస్ గూగుల్) అని జడ్జీలు తప్పుకున్నారు. చివరికి విజయమ్మ లాయర్ కోర్టుకి రావడం ఆలస్యం అయిందని ఆ పిటిషన్ కొట్టేశారు. నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, మాగంటి మురళీమోహన్ వీళ్ళందరూ కోట్లకు పడగలెత్తింది బాబు హయాంలోనే, ప్రతిగా ఎన్నికల సమయంలో పార్టీకి వీళ్ళు ఆర్ధిక వనరులు సమకూర్చే వాళ్ళు. ఐ టీ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చి వ్యవసాయం దండగ అని బాబు అన్నట్టు ప్రచారంలో ఉంది. అయితే అప్పట్లో ఐటీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న బెంగళూరు సిలికాన్ వ్యాలీని అధిగమించి హైటెక్ సిటీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. కానీ ఇవేవీ 2004లో బాబు ఘోర పరాజయాన్ని ఆపలేకపోయాయి. కారణం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బంధు ప్రీతి, వర్గ ప్రీతి ఉన్న వాళ్ళు తమ పతనాన్ని తామే శాసిస్తారు, బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. పార్టీలో తన పెత్తనమే సాగాలి, తన వారసత్వమే కొనసాగాలన్న తాపత్రయంతో తెలుగు సరిగ్గా మాట్లాడటం కూడా రాని తన కొడుకుని తెర పైకి తీసుకొచ్చాడు. మరో వైపు తెలుగుదేశం శ్రేణులు తారక్ కోసం ఎదురుచూస్తున్నారు. టీడిపి రాజకీయం రానున్న రోజుల్లో రసదాయకంగా ఉండబోతోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
                     “ఎవరైనా తక్కువ కులంలో పుట్టాలనుకుంటారా” అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యాడు బాబు. సహజంగానే కమ్మ కులం వాళ్లకు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ అని ఒక ప్రచారం (!) ఉంది. దాన్ని నిజం చేసేటట్టు బాలయ్య, చంద్రబాబు, చింతమనేని ఆ మధ్య చాలా సార్లు తమ కుల అహంకారం బయట పెట్టుకున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్న సంగతి రాజకీయాల్లో ఉండే వారు మరువకూడదు. ఒకప్పుడు హైటెక్ సిఎంగా ఖ్యాతిగాంచిన బాబు ఇప్పుడు ఒక పెద్ద జీరో. కళ్యాణ్ లాంటి వాళ్ళ మద్దతు కోసం ఎదురుచూస్తున్న చకోర పక్షి. పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా టిడిపి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదన్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. “ఇప్పుడు రాజకీయంగా మార్పు అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు గారి పాలన చాలా బావుంది” అని 1999లో మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారంటే అప్పట్లో బాబు హవా అలా నడిచింది. ఏనాడూ రాజకీయ వ్యాఖ్యలు చేయని ఏ‌ఎన్‌ఆర్ లాంటి లెజెండ్ “ఈ సారి నా ఓటు బాబుకే” అని బహిరంగంగా ప్రకటించారు అప్పట్లో. గతమెంతో ఘనం అన్నట్టు.. రాబోయే రోజుల్లో బిల్ గేట్స్, బిల్ క్లింటన్’తో దిగిన ఫోటోలు చూసుకుంటూ ఆ రోజుల్లో మరి…

                       అనుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే బాబు. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హడావుడి తప్ప ఎక్కడా టిడిపి శ్రేణుల అలికిడి లేదు.  ఇపుడు వారి సీట్ల సంఖ్య 23 కి పడిపోయేసరికి కాళ్ళు నేల మీద నడుస్తున్నాయి. 2014లో జనసేనపార్టీ మద్దతుతోనే గెలిచారు అనేది జగమెరిగిన సత్యం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వారికి ఎదురుతిరగడం, 2019 ఎన్నికల్లో పోటీ చేయడం చకా చకా జరిగిపోయాయి. ఇపుడు 2014 ఎన్నికల సీన్ ను రిపీట్ చేయాలని టీడీపీ నాయకులు తాపత్రయ పడుతున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకొని గద్దెనెక్కాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనసేనపార్టీ ముఖ్య నాయకులు చెంప మీద చెల్లుమనిపించేలా మీతో కలిసే ప్రసక్తే లేదని చెప్తున్నా, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి మీ కాళ్ళ దగ్గర పడి ఉంటామని టీడీపీ నాయకులు వేడుకుంటున్నారు. నిజానికి చాలా సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీపార్టీ కి సపోర్ట్ చేసి మా స్థాయి దిగజార్చుకోలేమని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాతో ఉన్నాడని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడటం వారి అవివేకతనాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే ఉన్న 23 కాస్తా ఊడిపోయేలా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకి వయసు అయిపోయింది. లోకేశ్ కి నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవని తమ పార్టీ నాయకులే చెప్పుకొని లోలోపల సందిగ్ధపడుతున్నారు. జూ. ఎన్‌టి‌ఆర్ వచ్చే పరిస్థితి లేదు. బాలయ్య పార్టీ పగ్గాలను నడపలేడు. రానున్న రోజుల్లో టీడీపీపార్టీ కాలగర్భంలో కలసిపోవాల్సిందేనా అన్న సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి..

                  గత రెండు దశాబ్దాల తెలుగునాట రాజకీయాలను పరీశీలిస్తే జనసేన లాంటి ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ అవసరం ఇప్పుడు ఉందని సామాన్యులు గ్రహించారు. దానికి నిదర్శనమే లోకల్ బాడీ ఎలక్షన్స్’లో జనసేన పరిగణించ దగ్గ సీట్లు గెల్చుకోవడం. కుటుంబ పాలనకు స్వస్తి చెప్పి, కొత్త తరానికి స్వాగతం పలకటానికి ప్రజలు సంసిద్దంగా ఉన్నారు. ఎప్పటిలానే స్థానిక సమస్యల పై పోరాడుతూ ప్రజలకు చేరువయ్యే అవకాశాన్ని జనసేన పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని ఆశిద్దాం. రాజకీయం అంటే వ్యాపారం కాదని ప్రజాసేవ అని చేతల్లో నిరూపిస్తున్న జనసైనికులు ఎంతైనా అభినందనీయులు.

అచ్చెన్నాయుడు అన్నట్టు “పార్టీ లేదు.. బొక్కా లేదు ఇంక”!

Written By

twitter : @27dots_

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way