నర్సీపట్నం, (జనస్వరం) : జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర మరియు నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు వడ్డేపల్లి గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ ప్రజలపై పన్నుల భారం మోపే జీవో కు మా జనసేన పార్టీ వ్యతిరేకమని 196 197 198 జీవోలను రద్దు చేయాలని కోరుతూ కౌన్సిల్ సమావేశం నుండి వాకౌట్ చేయడం జరిగిందని తెలియజేశారు. సూర్య చంద్ర మాట్లాడుతూ విలువ ఆధారిత పన్ను చెత్త సేకరణకు యా జర్ చార్జీలు ప్రజలపై పెనుభారం కాబోతున్నాయి. కావున ఈ జీవో మేం వ్యతిరేకం అని అన్నారు. టౌన్ అధ్యక్షులు అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు మరియు పెట్రోల్ డీజిల్ ధరలు భరించలేకుండా ఉంటే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు సముచితం కాదని జనసేన తరపున నిరసన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, అద్దేపల్లి గణేష్, మారిశెట్టి రాజా, కొత్తకోట రామ శేఖర్, వాకా సంతోష్, పిన పోతుల నాగు, B. మురళి . హరినాథ్, పైల ఈశ్వరరావు తదితురులు పాల్గొన్నారు.