
శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో జనసేన కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. అందులో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ.రామ్మోహన్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మన పార్టీ కి బలం అని అన్నారు. అందరూ కూడా ఒకే తాటిపై ఉండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. అలాగే ప్రస్తుత ఉన్న పొత్తులు పరిస్థితులపై పవన్ కళ్యాణ్ గారు నిర్ణయమే జనసేన నాయకులు, కార్యకర్తలు నిర్ణయం అవ్వాలని చెప్పారు. పాతపట్నం ఇంచార్జ్ గేదెల చైతన్య మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తప్పులను సామాన్య ప్రజలకు తెలియజేస్తూ వారిని ఆలోచనా విధానాన్ని మార్చాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందరూ జనసేన వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భం సత్తిబాబు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.