అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగుడా మండలం గసభ పంచాయితీలోని 20 మంది యువకులు జనసేనపార్టీలోకి చేరారు. అంజోడా సిల్క్ పారంలో ఈ రోజు జనసేనపార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. డుంబ్రిగుడా మండలాధ్యక్షుడు కొన్నేడి చిన్నారావు ఆధ్వర్యంలో అలాగే అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల కొన్నేడి లక్ష్మణ్ రావు, మాదాల శ్రీరాములు, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, ముత్తెమ్ ప్రసాద్, సోబోయి రాజు, సంతోష్ సింగ్ సమక్షంలో జనసేనపార్టీలోకి చేరారు. జనసేనపార్టీ అధినేత ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి యువత జనసేనపార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. రోజుకో మాన భంగం, రేప్ లు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకే గిరిజన పల్లెల్లో నుంచి యువత భారీగా జనసేనపార్టీలోకి చేరికలకు మొగ్గుచూపుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంలో భాగంగా భారీగా చేరికలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో YSRCP, TDP కార్యకర్తలు భారీగా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గసభ పంచాయితీ నుండి వంతల బాలాజీ, పాంగి సోమేశ్ కుమార్, పాంగి పవన్ కుమార్, ప్రశాంత్, లొలిత్, సుబ్బారావు, సంజయ్, బుజ్జి బాబు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు