
విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజకవర్గం పలు గ్రామాలలో పాదయాత్రలో భాగంగా KSR పురం, లింగలవలస గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ పాదయాత్ర చేపట్టారు. చేసి వైసీపీ ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తానని ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.