అనంతపురం ( జనస్వరం ) : సనాతన సంప్రదాయాల సంరక్షణ అందరి బాధ్యత అని జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్ గారు అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు శుక్రవారము నారాయణపురం పంచాయతీ అల్లూరి సీతారామరాజు మెయిన్ సర్కిల్ లో టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో “మన ఊరు – మన ఆట” వీరమహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ASR మెయిన్ సర్కిల్ ప్రాంగణమంతా రంగవల్లులతో నిండిపోయింది. మహిళలు, యువతలు పోటీపడి మరి వివిధ రూపాలలో ముగ్గులను వేశారు. ముస్లిం యువతులు సైతం ముగ్గులు వేస్తూ రంగులు నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, నగర కార్యదర్శిలు జక్కిరెడ్డి పద్మావతి, సువర్ణ, సావిత్రమ్మ, వాణిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో మొదటి బహుమతి పి.స్వాతి రూ 10,000, రెండవ బహుమతి శ్రావ్య గారు రూ. 8,000, మూడవ బహుమతి శ్రీవిద్య రూ 5000 అందించారు. వీరితో పాటు అశ్విని, సాయి, అంజలి, చందన, పావనిలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదుతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు జనసేన తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చీరలు అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ముగ్గుల పోటీలకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేసిన నగర కార్యదర్శి లాల్ స్వామి, వల్లంశెట్టి వెంకటరమణ, చిరులను టి.సి.వరుణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.