Logo
Date of Publish : 12 January 2024, 11:00 pm
Editor : Sake Naresh

అనంతపురంలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమం

      అనంతపురం ( జనస్వరం ) : సనాతన సంప్రదాయాల సంరక్షణ అందరి బాధ్యత అని జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్  టీ.సీ.వరుణ్ గారు అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు శుక్రవారము నారాయణపురం పంచాయతీ అల్లూరి సీతారామరాజు మెయిన్ సర్కిల్ లో టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో "మన ఊరు - మన ఆట" వీరమహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ASR మెయిన్ సర్కిల్ ప్రాంగణమంతా రంగవల్లులతో నిండిపోయింది. మహిళలు, యువతలు పోటీపడి మరి వివిధ రూపాలలో ముగ్గులను వేశారు. ముస్లిం యువతులు సైతం ముగ్గులు వేస్తూ రంగులు నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్  పెండ్యాల శ్రీలత, నగర కార్యదర్శిలు జక్కిరెడ్డి పద్మావతి, సువర్ణ, సావిత్రమ్మ, వాణిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో మొదటి బహుమతి పి.స్వాతి రూ 10,000, రెండవ బహుమతి శ్రావ్య గారు రూ. 8,000, మూడవ బహుమతి శ్రీవిద్య  రూ 5000  అందించారు. వీరితో పాటు అశ్విని, సాయి, అంజలి, చందన, పావనిలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదుతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు జనసేన తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చీరలు అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ముగ్గుల పోటీలకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేసిన నగర కార్యదర్శి లాల్ స్వామి,  వల్లంశెట్టి వెంకటరమణ, చిరులను  టి.సి.వరుణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com