భీమిలిలో ” మన జనసేన – మన కుటుంబం ” కార్యక్రమం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో ప్రారంభం
భీమిలిలో ” మన జనసేన – మన కుటుంబం ” కార్యక్రమం ఘనంగా జనసేన పార్టీ ప్రారంభించింది. డా. సందీప్ పంచకర్ల గారి ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రతీ కుటుంబానికి జనసేన పార్టీ స్థాపనకు గల కారణాలు, సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తెలిపి స్థానిక నాయకత్వాన్ని ప్రజలకు పరిచయం చేసి వాళ్ళని బలపరిచే కార్యక్రమమే “మన జనసేన- మన కుటుంబం”. ఇందులో భాగంగా డా సందీప్ పంచకర్ల గారు మరియు భీమిలి నియోజకవర్గ నాయకులు ప్రతీ వార్డు, మండలాల్లో కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వారికి వివరిస్తారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు శ్రీ బీ వి క్రిష్ణయ్య గారు, 6వ వార్డ్ అభ్యర్ది పోతిన అనురాధ గారు, 7వ వార్డ్ అభ్యర్ది నాగొతి అమరావతి గారు, 8వ వార్డ్ అభ్యర్ది శాఖరి శ్రీనివాస్ (శ్రీను బాబు) గారు, జనసేన నాయకులు నాయుడు గారు, వీర మహిళ దేవి కుబిరెడ్డి గారు, నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.