ధర్మవరం, (జనస్వరం) : ఈ నెల 10 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత్వం తీసుకోవడం వలన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50 వేల రూపాయల మెడికల్ ఖర్చులు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్క జనసైనికుడి కుటుంబానికి భరోసాగా ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలు మరియు గతంలో సభ్యత్వం తీసుకున్నవారు తిరిగి వారి సభ్యత్వాలను రెన్యువల్ చేసుకొని కొత్త వాళ్లకు కూడా సభ్యత్వ నమోదు చేపించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిలకం మధుసూదన్ రెడ్డి కోరారు. గతంలో క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్స్ కు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులకు, ధర్మవరం పట్టణ కార్యనిర్వహణ కమిటీ సభ్యులకు, నియోజకవర్గ నాయకులకు మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.