Logo
Date of Publish : 09 February 2023, 6:36 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి

       ధర్మవరం, (జనస్వరం) : ఈ నెల 10 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత్వం తీసుకోవడం వలన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం,  50 వేల రూపాయల మెడికల్ ఖర్చులు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్క జనసైనికుడి కుటుంబానికి భరోసాగా ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలు మరియు గతంలో సభ్యత్వం తీసుకున్నవారు తిరిగి వారి సభ్యత్వాలను రెన్యువల్ చేసుకొని కొత్త వాళ్లకు కూడా సభ్యత్వ నమోదు చేపించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిలకం మధుసూదన్ రెడ్డి కోరారు. గతంలో క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్స్ కు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులకు, ధర్మవరం పట్టణ కార్యనిర్వహణ కమిటీ సభ్యులకు, నియోజకవర్గ నాయకులకు మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com