
అనంతపురం ( జనస్వరం ) : క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ… గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్ డివిజన్ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక రామ్ నగర్ కార్యాలయంలో 11 నుంచి 30 డివిజన్ ల నాయకులతో టి.సి.వరుణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు 2024 ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యలపై చర్చించారు. డివిజన్ స్థాయిలో అవసరమైన ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానన్నారు. జనసేన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కార్యోన్ముకులు కావాలని టి సి.వరుణ్ గారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, గండి శ్రీనివాసులు (సీనియర్ అడ్వకేట్)నగర ప్రధాన కార్యదర్శులు హుస్సేన్, శ్రీ దరాజ్ భాష, నగర కార్యదర్శులు రాజేష్ కన్నా, కేశవ్, నాయకులు సల్మాన్, విజయ రాయల్, సాయి, రామ్మోహన్, షఫీ, సెక్ష తదితరులు పాల్గొన్నారు.