Logo
Date of Publish : 02 February 2024, 10:12 pm
Editor : Sake Naresh

జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం : టిసి వరుణ్

    అనంతపురం ( జనస్వరం ) : క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ... గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్  టీ.సీ.వరుణ్  డివిజన్ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక రామ్ నగర్ కార్యాలయంలో 11 నుంచి 30 డివిజన్ ల నాయకులతో  టి.సి.వరుణ్  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు 2024 ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యలపై చర్చించారు. డివిజన్ స్థాయిలో అవసరమైన ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానన్నారు. జనసేన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కార్యోన్ముకులు కావాలని టి సి.వరుణ్ గారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు  పొదిలి బాబురావు, గండి శ్రీనివాసులు (సీనియర్ అడ్వకేట్)నగర ప్రధాన కార్యదర్శులు హుస్సేన్, శ్రీ దరాజ్ భాష, నగర కార్యదర్శులు రాజేష్ కన్నా, కేశవ్, నాయకులు సల్మాన్, విజయ రాయల్, సాయి, రామ్మోహన్, షఫీ, సెక్ష తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com