గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల హడావిడి మొదలయ్యిన సంగతి తెలిసిందే. రాజంపేట జనసేన నాయకులు రామశ్రీనివాసులు పత్రికా ముఖంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి. అలా కాకుండా స్థానిక వైసీపీ నాయకులు రౌడీ రాజ్యం పేరుతో గుండాయిజం చేస్తాం అంటే భారత రాజ్యాంగ చట్ట ప్రకారం వ్యతిరేకులు అని భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేవలం వైసీపీ వర్గానికి మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ విద్యతో చేపట్టిన మీ వృత్తి రీత్యా పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమాజంలో అందరినీ సహృదయంతో సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది అని అన్నారు. అదేవిధంగా చెడ్డ వారి వల్ల ఈ సమాజం చెడిపోలేదని మంచి వారి వల్ల చెడిపోయిందని, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దైర్యంగా అడగలేని భయస్తులవల్ల మనకెందుకులే అనే స్వార్ధ రాజకీయ నాయకుల పట్ల చెడిపోయిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జనసేన, బీజేపీ కూటమి ద్వారా పిలుపునిస్తున్నామన్నారు. సమాజ సేవ దృక్పథం, మేధావులు, విద్యావంతులు అందరూ ఏకమై దైర్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. గెలుపోటములు పక్కన పెట్టి ముందు జనసేన పార్టీ తరుపున పోటీ చేసి స్థానికంగా బలాన్ని పెంచుకోవాలని సూచించారు. పంచాయితీ ఎన్నికలు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మనకు లభించే గొప్ప అవకాశం అన్నారు. మన గ్రామాల్లో ఉండే సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరి మద్దతు తీసుకుని నిర్మొహమాటంగా జనసేన నాయకులు ‘సర్పంచ్, వార్డుమెంబర్లుగా నామినేషన్ వెయ్యాలి. నామినేషన్ వేసిన వారికి ‘జనసేన, బీజేపీ’ కూటమితో అభ్యర్థులందరికీ అండగా నిలబడుతుందని భరోసా ఇస్తున్నామన్నారు. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పంచాయతీకి వచ్చే నిధులు కేంద్రం నుండి వస్తాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కాదు. చాలా మంది అధికార పార్టీ వాళ్ళు మా అభ్యర్థిని గెలిపించకపోతే నిధులు రావు అని భ్రమ పటిస్తుంటారు. ఇటువంటి అపోహలు నమ్మవద్దని చెప్పారు. ఈ ఎన్నికల్లో మన నాయకులనే గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధికి భాగస్వామిగా అవ్వాలని నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటరుకు తెలియజేస్తున్నానని తెలిపారు.