రాజంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ ఐక్యత కోసం అందరం పాటు పడదామని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన నేత అతికారి కృష్ణను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో జనసేన టిడిపి కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరం మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, భాస్కర్ పంతులు, గోపాల్, కోలాటం హరి, పోలిశెట్టి శ్రీనివాసులు, బాల సాయి, వాసు, కిషోర్ చంగల్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com