విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ లీగల్ సెల్ విజయనగరం విభాగం సమావేశం శనివారం ఉదయం స్థానిక ఆర్.టి.సి కాంప్లెక్స్ వద్దనున్న జి.ఎస్.ఆర్ హోటల్లో జనసేన పార్టీ విజయనగరం లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిలుగా ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టే ఏ వ్యక్తినైన అణిచివేసేలా ప్రయత్నాలు చేస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాల నుంచి జనసేన పార్టి కార్యకర్తలను, నాయకులను కాపాడేందుకే జనసేన లీగల్ సెల్ విభాగాన్ని అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించారని, జనసైనికులకు లీగల్ సెల్ అనేది ఓ రక్షణ గోడ వంటిది శివశంకర్ తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే వుంటుందని, వారి పట్ల పోలీసులతో దాడులు చేయించే అధికార పక్షం నుంచి కాపాడేందుకు ఈ లీగల్ సెల్ విభాగం పని చేస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగనే విజయనగరంలో సమావేశం ఏర్పాటు చేసి జనసేన లీగల్ సెల్ విభాగ ప్రత్యేకతలు, వారు చేసే పనుల గురించి జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు అవగాహన కల్పించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. కేశవరావు, శ్రీకాకుళం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు ఫాల్గుణ రావు, రేగు మహేష్, జి.మన్ను, జి. విద్యాసాగర్, టి. సీతాపతి, విశాఖపట్నం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రేవతి, జి.ఎన్.కళావతి, డి. తవిటి నాయుడు, సతీష్ బాబు,జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మర్రాపు సురేష్, జమ్ము ఆదినారాయణ, వబ్బిన సన్యాసి నాయుడు, సుంకరి అప్పారావు,రేగిడి లక్ష్మణ్ రావు, బూర్లి విజయ్ శంకర్, గొర్రపల్లి రవి, వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు, మిడతాన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.