తిరుపతి కరోనా హాస్పిటల్ కి ఆక్సిజన్ కాన్సన్ ను అందజేసిన కువైట్ NRI జనసేన
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ జన్మదినం కావడంతో ఒక నెల రోజుల ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా “జనసేన NRI సేవా సమితి కువైట్” వారి సమక్షంలో ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ మరియు వారి మిత్రులు మొహమ్మద్ గౌస్, దామోదర్ నాయుడు. సహకారంతో ఈ రోజు సుమారు 60 వేల విలువచేసే (ఆక్సిజన్ కాన్సన్ ట్రీట్ మెషిన్ ) రుయా ఇన్చార్జ్ సూపర్డెంట్ నాగ మునిందర్ బాబు గారికి అందజేయడం జరిగింది ఇలాగే జనసేన పార్టీ నాయకులు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ వాళ్లకి తోడుంటూ కరోనా సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేస్తున్నాము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ ,కాంచన శ్రీకాంత్, కృష్ణయ్య ,మధు సుదన్,పగడాల మురళి ,కొండా రాజమోహన్ వేమూరి హరి ,మరియు ఆస్పత్రి మాజీ వర్కింగ్ చైర్మన్ చినబాబు ఆస్పత్రి వైద్యులు సిబ్బంది జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది