తిరుపతి ( జనస్వరం ) : తిరుపతికి చెందిన కృష్ణ కాంత్ రాయల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో " జనసేనానితో గ్లాసు టీ " కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్టంలో వలసలు ఆగాలి. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉండాలి. ఈ దిశగా నేను ఆలోచిస్తాను. కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే గౌరవప్రదమైనది, ఉన్నతమైనది అనే ఆలోచన కాకుండా, వ్యవసాయం, వ్యాపారం ఇతర రంగాలు కూడా అద్భుతమైనవిగా అనేలా తీర్చిదిద్దాలి. సొంత ప్రాంతాల్లో సరైన అవకాశాలు రాక, చదివిన చదువుకు ఉద్యోగాలు లేక యువత ఎక్కడెక్కడికో వలసలు వెళ్లి సాధారణ జీతాలకు పని చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. యువత సాధికారత దిశగా ఆలోచించాలి. నాకోసం అని కాకుండా సమాజం కోసం నేను ఏం చేయగలుగుతున్నాను అన్న విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అది చేస్తాను... అని చెప్పను. అందరికీ ఉపయోగపడే పనులు మాత్రం కచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నానని అన్నారు. స్థానిక సమస్యలపై కృష్ణకాంత్ కళ్యాణ్ గారికి వివరించారు. అలాగే పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని అభినందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com