Logo
Date of Publish : 13 January 2024, 9:57 pm
Editor : Sake Naresh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసిన కృష్ణ కాంత్ రాయల్

    తిరుపతి ( జనస్వరం ) : తిరుపతికి చెందిన కృష్ణ కాంత్ రాయల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది.  జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో " జనసేనానితో గ్లాసు టీ " కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్టంలో వలసలు ఆగాలి. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉండాలి. ఈ దిశగా నేను ఆలోచిస్తాను. కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే గౌరవప్రదమైనది, ఉన్నతమైనది అనే ఆలోచన కాకుండా, వ్యవసాయం, వ్యాపారం ఇతర రంగాలు కూడా అద్భుతమైనవిగా అనేలా తీర్చిదిద్దాలి. సొంత ప్రాంతాల్లో సరైన అవకాశాలు రాక, చదివిన చదువుకు ఉద్యోగాలు లేక యువత ఎక్కడెక్కడికో వలసలు వెళ్లి సాధారణ జీతాలకు పని చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. యువత సాధికారత దిశగా ఆలోచించాలి. నాకోసం అని కాకుండా సమాజం కోసం నేను ఏం చేయగలుగుతున్నాను అన్న విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అది చేస్తాను... అని చెప్పను. అందరికీ ఉపయోగపడే పనులు మాత్రం కచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నానని అన్నారు. స్థానిక సమస్యలపై కృష్ణకాంత్ కళ్యాణ్ గారికి వివరించారు. అలాగే పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com