కోవిడ్-19-ప్లాస్మా చికిత్స-దాని ఉపయోగం – మన సామాజిక బాధ్యత.

కోవిడ్-19-ప్లాస్మా చికిత్స-దాని ఉపయోగం – మన సామాజిక బాధ్యత.

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి?
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తుల రక్తంలో ఆ వైరస్ మీద ఎలా పోరాడాలో తెలిసిన యాంటీ బాడీస్ ఉంటాయి. ఈ రక్తాన్ని కొత్తగా కరోనా వైరస్ బారిన పడి, దానితో పోరాడుతున్న రోగులకు ఇచ్చినపుడు అప్పటికే ఆ వైరస్ తో ఎలా పోరాడాలో తెలిసిన యాంటీ బాడీస్ వైరస్ మీద పోరాడి ఆ రోగిని క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడేస్తుంది.

ఈ ప్లాస్మా చికిత్స ఎంతవరకు పని చేస్తుంది?
ఈ ప్లాస్మా చికిత్సని గతంలో SARS, H1N1, Ebola వంటి వ్యాధుల చికిత్సలో విజయవంతంగా వాడటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షణాలు ఉన్న రోగుల మీద జరుగుతున్న,జరిగిన పరిశోధనల్లో ఈ ప్లాస్మా చికిత్స సమర్ధవంతమైన, సురక్షిత చికిత్స అన్న ఫలితాలు వస్తున్నాయి.ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గారు స్వయంగా ఈ ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్నారు.

ప్లాస్మా చికిత్స ఎవరికి అవసరం పడుతుంది?
భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడినా ఆరోగ్యం మెరుగు పడని వారికి ఈ ప్లాస్మా థెరపీని ఇవ్వవచ్చు.

ప్లాస్మా దానం చేయడానికి ఎవరు అర్హులు ?
అప్పుడే కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులు ఈ ప్లాస్మా దానానికి అర్హులు. అయితే దాత యొక్క బ్లడ్ గ్రూప్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ సరిపోవాలి. దానం చేసే వారికి ఇతర వ్యాధులు ఉండకూడదు. రక్తంలో హీమోగ్లోబిన్ కూడా సరిపడా ఉండాలి.

ఎంత రక్తం ఇవ్వవలసి ఉంటుంది ?
సాధారణంగా రోగికి 200ml ప్లాస్మాని ఒకటే మోతాదు ని 2 గంటల పాటు ఎక్కిస్తారు. దానం చేయాలి అనుకునే వాళ్ళ దగ్గరినుంచి 350-400 ml రక్తం తీసుకోవడం జరుగుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.

మన సామాజిక బాధ్యత ఏమిటి?
ఇప్పటికే చాలాచోట్ల ప్రభుత్వాలు, స్వచ్చంద సేవా సంస్థలు కోవిడ్ నుంచి కోలుకున్న వారినుంచి రక్తం సేకరించి “ప్లాస్మా బ్యాంక్” లు ఏర్పాటు చేశారు. అలాంటి వారికి మనం స్వచ్చందంగా ప్లాస్మా ఇవ్వడమే మన సామాజిక బాధ్యత.

“అందరికోసం ఆలోచిద్దాం.
బ్రతుకుదాం, బ్రతికిద్దా౦”
                                                                     ~ డా. ఏవియస్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Pawan Kalyan Donations List
Pawan Kalyan Donations List
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way