అద్దంకి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో అద్దంకి నియోజకవర్గం మెదరమిట్ల గ్రామంలో అన్నపూర్ణమ్మ గారి అధ్యక్షతన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సమక్షంలో జనసేన పార్టీలోకి 15మంది యువకులు చేరారు. వారికి రాయపాటి అరుణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన జగన్ రెడ్డి ఆధ్వర్యంలో అస్తవ్యస్తంగా సాగుతోందని అన్నారు. ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందన్నారు. పార్టీలోకి చేరిన వారిని పార్టీ కోసం కష్టపడాలని సూచిస్తూ, జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com