ధర్మవరం ( జనస్వరం ) : ఈ రోజు మకర సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి తన స్వగృహంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిలకొండయపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు చేరడం జరిగింది. అరవేటి దామోదర్, తిమ్మంపల్లి కార్తీక్,దాసగానిపల్లి నారాయణప్ప,దాసగానిపల్లి నారాయణస్వామి,దాసగానిపల్లి శంకరప్ప, దాసగానిపల్లి శివకుమార్, దాసగానిపల్లి పుల్లన్న, దాసగానిపల్లి దామోదర్, మరియు ధర్మవరం మండలం మాలగుంట్లపల్లి గ్రామానికి చెందిన 3 కుటుంబాలు దేరెంగుల సురి, ఏరికిల అదెప్ప, పూజారి శంకర్ తదితరులు చేరారు.