ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తన జనసైనికులకు తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారు. ఆంద్రప్రదేశ్ ని ఇప్పటికే అంధకారంలోకి నెట్టిన వైసిపి నుండి రాష్ట్రాన్ని విముక్తి చేసి, అభివృద్దిలోకి తీసుకొనివెళ్ళడం అనివార్యం ఇప్పటి పరిస్తితుల్లో…. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ఒక పెద్దతోడు, తండ్రితో సమానం. కాని నేడు ప్రగతి పక్కన పెడితే, ఆక్రమణలు, అక్రమాలు, తన సొంత పార్టీ శ్రేణులకు మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి తీరు చూస్తున్నాం.
జనసేనాని జనసేన శ్రేణులకే కాదు, ఈ రాష్ట ప్రగతి, అభ్యున్నతి, అభివృద్ది తీసుకొని రావాలని దృడసంకల్పంతో… ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలకూడదు అనే ఉద్దేశంతో టి.డి.పి తో కలసి ప్రయాణించడానికి నిర్ణయం తీసుకొన్నారు. పొత్తులో భాగంగా గెలుపు అన్నది 98% స్ట్రయిక్ రేట్ గా ఉండాలని 24 అసెంబ్లీ మరియు 3 లోక్ సభ స్థానాలకు పోటి చెయ్యాలని ఆకాంక్షించారు.
ఇక్కడ జనసైనికులు ముఖ్యంగా ఆలోచించవలసిన విషయాలు:
1. ధనప్రవాహం లేని ఎన్నికలు లేవు నేటి ఎన్నికల్లో- అవినీతితో సంపాదించిన లక్షల కోట్లు వైసిపి సొంతం. మరి మనపార్టీ విషయానికి వస్తే? మన ఆదాయ వనరులు :-
👉 పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వచ్చిన సొంత డబ్బు.
👉 జనసేనకి విరాళాలు ఇచ్చే జనసైనికులు మరియు ప్రోత్సాహక పెద్దలు.
👉 పార్టీ సభలకు విశేషంగా ఖర్చు పెట్టే నాయకులు.
మరి వైసిపితో డబ్బు విషయంలో మనం పోటీ పడగలమా??? అందుకే మన నాయకుడు ఏరి కోరి వైసిపికి దీటుగా నిలబడే వారిని మన 24 అంసెంబ్లీ స్థానాలలో నిలపెడుతున్నారు.
2. పార్టీ కేడర్ – వైసిపి రాష్ట అభివృద్దిని పక్కనపెట్టి తన కేడర్ ప్రయోజనాలు మిన్నగా వ్యవహరించిన తీరు అందరికి తెలిసిందే. వారి కేడర్ని ధీటుగా ఎదుర్కోవాలంటే, మనకి ప్రధాన ప్రతిపక్షం టి.డి.పి బాసటగా ఉండాలి. అంతేకాదు ప్రతీ జనసైనికుడు పార్టీ కేడర్లో మమేకం కావాలి. మీరే చెప్పండి? మన పార్టీలో ఉన్న ప్రజాసామ్యం ఇంక ఎక్కడైనా ఉందా?? మన నాయకుడు ఎలా ఉండాలో, ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదో, ఎలా మాట్లాడాలో అన్ని మనమే నిర్ణయించుకొంటాం. కానీ పార్టీ కేడర్లో ముఖ్య భూమికని పోషిస్తున్నామా? విరివిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నామా???
ఈ ఎన్నికలలో జనసైనికులు తమవంతు పాత్రని పోషించి, జనసేనానిలో నమ్మకం పెంచుదాం!
3. పోల్ మేనేజ్మెంట్ – సంస్థాగతంగా పాతుకుపోయిన పార్టీలలో పోల్ మేనేజ్మెంట్ టీం కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కాని మనం గడిచిన మూడురోజులుగా మన నాయకుడి తీరుని విమర్శించడమే పనిగా పెట్టుకొన్నాము. జనసైనికులు అంటే జనసేన అభిమానులు మాత్రమే కాదు, ఆంధ్రరాష్ట్ర ప్రగతికి సోపానాలు.
4. బూత్ మేనేజ్మెంట్ – ఒక్కో అసెంబ్లీ స్థానానికి సుమారు వంద, రెండు వందల పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక్కో దానికి సుమారు నలుగురు బూత్ ఏజెంట్స్ కావాలి. అంటే సుమారుగా 200 పోలింగ్ బూత్స్ కి 800 మంది బూత్ ఏజెంట్స్ కావాలి. నికార్సైన బూత్ ఏజెంట్ ఉంటేనే ఎన్నికలలో వైసిపి బూత్ కేప్చర్ ని ఆపగలం. ఆ వ్యవస్థని మనం పార్టికి సమాంతరంగా పటిష్టం చేసుకోవాలి.
5. ఓటర్స్ – ప్రజల నాడి, వాడి తెలిసినోడే నిజమైన నాయకుడు. వారికి కావాల్సింది వైసిపి అక్రమ చెర నుండి మన ఆంధ్ర రాష్ట విముక్తి. దానిని మన జనసేనాని పట్టుకొన్నారు. భేషజాలకు పోకుండా, తన స్థాయిని తగ్గించుకొన్నారు అంటే అది తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం కాదు ప్రజల ఆకాంక్షలు నెగ్గించాలని.
మరి మనం ఏం చేస్తున్నాం? గడిచిన మూడు రోజులుగా, మనలో మనమే డిబేట్స్, హేటెడ్ మెసేజెస్, నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం… ఇవేనా మనం చెయ్యవలసింది?
మనమీద పెట్టిన బాధ్యతను మనం గుర్తెరిగి, మన 24 అసెంబ్లీ మరియు 3 లోక్ సభ స్థానాలే కాకుడా, మొత్తం రాష్ట అసెంబ్లీ స్థానాలలో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలకుండా, మన నాయకుడు మనమీద ఉంచిన గౌరవాన్ని కాపాడుకొందాం.
చివరి మాట:
నాయకుడికి వెంట నడవడం అంటే, నాయకుడి ఆశయాలను గౌరవించడం.
జనసేనాని మాటే వేదం.
ఇట్లు
సురేష్ కరోతు (ఉత్తర అమెరికా)